![]() |
![]() |

శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతీ వారం లాగే ఈ వారం కూడా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తోంది. దానికి సంబందించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో బింబిసార మూవీ స్పూఫ్ చేసి చూపించారు హైపర్ ఆది, నాటి నరేష్. ఆదిసార పేరుతో రాజు గెటప్ లో ఆది వచ్చాడు. సెట్ లో ఏర్పాటు చేసిన మాయా అద్దంలో తనను తాను చూసుకుని "ఏమి ఈ రాజసం, ఏమి ఈ తేజస్సు" అని తెగ సంబరపడ్డాడు ఆది. "ఇదేదో బొగడా దర్పణంలా ఉంది లేదంటే రాజసం, తేజస్సు అవన్నీ నీకు ఎక్కడున్నాయి" అని నాటీ నరేష్ ఆదిని అనరాని మాటలు అని పరువు తీసేసాడు.
ఆ తర్వాత వాళ్ళు ఆ అద్దాన్ని టచ్ చేసేసరికి శ్రీదేవి డ్రామా కంపెనీ సెట్ లో వచ్చి పడ్డారు. అక్కడకు వచ్చి "మాకు మాయా దర్పణం కావాలి అని బులెట్ భాస్కర్ ని అడిగేసరికి శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు స్కిట్స్ అవి చేసి దాన్ని పట్టుకుపోయారు. అది కావాలంటే ఆ టీంని పిలిపించాలి" అని చెప్పాడు. ఆ తర్వాత ఇమ్మానుయేల్ వచ్చి "మా ఇంటికి ఒకసారి రండి సర్...చంద్రముఖి అక్కడే ఉంది వేంకటపతి రాజా గారు" అని బింబిసార గెటప్ సూట్ కాలేదన్న విషయాన్నీ ఆదికి ఇండైరెక్ట్ చెప్పాడు.
తర్వాత 'బలగం' మూవీ టీమ్ స్టేజి మీదకు వచ్చింది. "సక్సెస్ ని షేర్ చేసుకోవడానికి నేను శ్రీదేవి డ్రామా కంపెనీకి రాలేదు..నా ఇంటికి వచ్చాను..చాలా రోజుల తర్వాత నా ఇంటికి వచ్చినందుకు ఈ ల్యాండ్ కి.." అంటూ తాను నిలబడిన నేలను వంగి ముద్దాడాడు వేణు. ఇందులో సాయి సన్విద్ పాడిన పాటలు అందరినీ అలరించాయి. ఇక స్టేజి మీదకు ఎస్తేర్ వచ్చింది. దాంతో "ఎంతమంది ఎస్తేర్ ఫాన్స్ ఇక్కడ" అని రష్మీ అడగడంతో అందరూ కెవ్వున అరిచారు. తర్వాత రీతూ చౌదరిని స్టేజి మీదకు పిలిచింది రష్మీ.."నీ జీవితంలో అనుకోని సంఘటనలు జరిగాయి" అనేసరికి రీతూ ఎమోషనల్ ఐపోయింది. "సాయిబాబా పటం పెట్టుకోవాల్సిన దగ్గర మా నాన్న పటం పెట్టుకోవాల్సివచ్చింది ఇప్పుడు" అని చెప్తూ ఏడ్చేసింది.
![]() |
![]() |